అనుష్కకు మిగిలింది జీరోయే

December 03, 2015 | 02:51 PM | 2 Views
ప్రింట్ కామెంట్
anushka-no-remuneration-for-size-zero

పాపం సినిమా కోసం ఏ హీరోయిన్ పడని కష్టం సైజ్ జీరో కోసం పడింది స్వీటీ అనుష్క. అమాంతం 20 కేజీల దాకా పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. వచ్చిన మంచి మంచి ఆఫర్లను వదిలేసుకుంది. ఇంత చేస్తే ఆమెకు దక్కిన ప్రతిఫలం సున్నాయే. ఫస్ట్ హాఫ్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కించినప్పటికీ సెకండాఫ్ వచ్చేసరి ఘోరంగా దెబ్బపడిపోయింది. అసలు కథ సైడ్ ట్రాక్ ఎక్కేసి హీరోయిన్ విలన్ మధ్య జరిగే వార్ తో మొదటికే మోసం వచ్చింది. దీంతో సినిమా ఫలితం తారుమారు అయ్యింది. అంతేకాదు ఇప్పుడు  అనుష్క రెమ్యునరేషన్ విషయంలో కూడా గండిపడింది.

                          ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా సినిమా ఒకవేళ ఆడకపోతే తనకు రెమ్యునరేషన్ చెల్లించాల్సిన అవసరం లేదని అనుష్క పీవీపీ సంస్థతో ఒప్పందం చేసుకుందట. దీంతో అనుష్క పడిన శ్రమ అంతా వృథా అయిపోయింది. ఇక ఈ సినిమా కు దెబ్బపడటానికి అసలు కారణం కూడా మరోకటి ఉందండోయ్. బోరింగ్ కథనంతో వచ్చినప్పటికీ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం కారణంగా సుకుమార్ కుమారి 21ఎఫ్ కూడా సైజ్ జీరో కలెక్షన్లకు గండికొట్టి ఫ్లాప్ అవటానికి మరో కారణంగా మిగిలింది.  అలా ఎంత కష్టపడ్డప్పటికీ అనుష్కకి మిగిలింది మాత్రం జీరోయే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ