అనుష్క అవుట్‌.. అంజలి ఇన్‌

December 06, 2014 | 03:44 PM | 33 Views
ప్రింట్ కామెంట్

హీరోయిన్‌ అంజలి టాలీవుడ్‌లో మెల్లగా పికప్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. సరైన ఆఫర్లు లేక డీలా పడిన ఈమెకు, ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్టు టాక్‌. అనుష్క చేయాల్సిన ప్రాజెక్టులో అవకాశం కావడంతో ఈ అమ్మడు ఖుషీగా వుంది. ‘పిల్ల జమీందార్‌’ ఫేం అశోక్‌.. ‘భాగమతి’ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. భాగమతి రోల్‌కు తొలుత అనుష్కను ఎంపిక చేశాడు. ఆమె ఓకే చెప్పేయడం అంతా జరిగిపోయింది. ఈలోగా ఏమైందో తెలీదుగానీ చాలా సినిమాలతో బిజీగా వుండడంవల్ల కాల్షీట్లు కేటాయించడం కష్టమవుతుందని తెలిపిందట. వున్నట్లుండి సడన్‌గా చెప్పడంతో ఈ డైరెక్టర్‌ షాకయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ రోల్‌కి ఎవరు సెట్‌ అవుతారో గాలింపు మొదలుపెట్టాడు. చివరకు ‘అభినవ సీతమ్మ’ అంజలికి ఛాన్స్‌ దక్కినట్టు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. సరైన ఆఫర్‌ కోసం ఎదురుచూస్తున్న అంజలికి ఈ చిత్రం బ్రేక్‌ రావచ్చని అంటున్నారు. దీనికి సంబందించి పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ