‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కి నితిన్‌

December 06, 2014 | 03:42 PM | 33 Views
ప్రింట్ కామెంట్

‘చిన్నదాన నీ కోసం’ మూవీతో త్వరలోనే అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నితిన్‌.. ఈసారి మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్‌ సీజన్‌లో ప్రత్యక్షం కానున్నాడు. డిసెంబర్‌ రెండో వారం నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్‌ సీజన్‌ మొదలవబోతోంది. తాజాగా ఈ ప్రోగ్రాం షూట్‌లో పాల్గొన్న నితిన్‌.. జస్ట్‌ ఇప్పుడే ప్రోగ్రాం ముగించుకున్నాను. నాగ్‌తో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం షూట్‌ ఎంజాయ్‌ చేశాను అని ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ఎపిసోడ్‌ ఎప్పుడు ప్లే అవనుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. కాకపోతే, చిన్నదాన నీ కోసం మూవీ రిలీజ్‌ టైంలో ఈ ఎపిసోడ్‌ వచ్చేలా ప్లాన్‌ చేసుకుంటారనే టాక్‌ మాత్రం వినిపిస్తోంది. అలాగైతే, ఆ ఎపిసోడ్‌ని మూవీ ప్రమోషన్‌కి కూడా వాడుకోవచ్చు కదా. అది అసలు కాన్సెప్ట్‌ అన్నమాట! అన్నట్లు.. చిన్నదాన నీకోసం మూవీ రిలీజ్‌ డేట్‌ని నితిన్‌ ఇక్కడే ట్వీట్‌ చేశాడు. ఇటీవలే ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కి కూడా నాగ్‌ అతిథిగా హాజరయ్యాడు. ఇదిలావుంటే అఖిల్‌ మొదటి సినిమాని నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి, నాగ్‌ ఇద్దరూ సంయుక్తంగా కలిసి నిర్మించనున్నారని తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ