అన్ని అవకాశాలూ అందిపుచ్చుకోను

November 28, 2014 | 05:42 PM | 46 Views
ప్రింట్ కామెంట్

యాంకర్ల లిస్టులో ఇప్పుడు శ్యామల పేరూ ప్రధానంగానే వినిపిస్తోంది. ఆడియో ఫంక్షన్లకూ, సినిమా ఫంక్షన్లలో బాగానే కనిపిస్తోంది. దీంతో సినిమా అవకాశాలనూ బాగానే దక్కించుకుంటోంది. ఈమధ్యే వచ్చిన లౌక్యం మూవీలో హీరోయిన్ కు, ఒకలైలా కోసం సినిమాలో నాగచైతన్యకు అక్కగా కనిపించింది. చిన్నా చితకా పాత్రలేనా మరేమైనా ముందుకు వెళ్లబోతున్నారా అంటూ ఓ ఫంక్షన్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పెద్దపెద్ద సినిమాల్లో ఐటంసాంగ్స్ చేయమని అవకాశాలొచ్చాయి కానీ తానే అందుకు ఒప్పుకోలేదని సమాధానమిచ్చింది. తనకు పుట్టింటి, అత్తింటి వారి సహకారం పూర్తిగా ఉందనీ, వాళ్ళవల్లే ఈ స్థాయికి వచ్చాననీ, అందుకే గౌరవంగా కనిపించే పాత్రలనే ఇష్టపడతానని చెప్పింది. తనకు ఆఫర్లు వచ్చినా అందులో నచ్చినవి మాత్రమే ఎంచుకుంటాననీ, వచ్చిన అవకాశాలన్నిటినీ ఉపయోగించుకునేది లేదనీ తనకు నచ్చినవే చేస్తానని చెప్పింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ