రాంచరణ్ కొత్త సినిమా శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో బాబాయ్ హీరోయిన్ చరణ్ తో రొమాన్స్ చేస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చరణ్ సినిమాకు చెల్లి క్యారెక్టర్ లో మాత్రమే కృతి కర్బంద నటిస్తోందట. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య స్పష్టం చేశారు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కృతి కర్బంద పాత్ర కూడా కీలకమైనదే నంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ మార్చి మొదట వారంలో మొదలు పెట్టనున్నట్టు నిర్మాత వెల్లడి చేశారు. ఆ తరువాత వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని చెప్పారు.