రాజుగారి గది సక్సెస్ తో ఇప్పుడు ఓంకార్ మరో సినిమా డైరెక్షన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది రాజుగారి గది సినిమాకు ముందే అనుకున్న మాట ప్రకారం దక్కిన అవకాశం. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ లో ఓంకార్ తో అనిల్ సుంకర సినిమా చేయాలని అనుకున్నాడట తన దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని ‘రాజు గారి గది’ ఫలితాన్ని బట్టి వాటిని తెరకెక్కిస్తానని ఓంకార్ ఇంతకు ముందే చెప్పాడట. ఆ రెంటిలో ఒకటి ఫ్యామిలీ ఎమోషన్స్ మీద నడిచే కామెడీ సినిమా కాగా.. ఇంకోటి ‘రాజు గారి గది’కి సీక్వెల్. ముందే ఫ్యామిలీ సినిమా చేసి... ఆ తర్వాత సీక్వెల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. కాబట్టి అనిల్ సుంకరతో చేసే సినిమా అదే కావచ్చు. కేవలం రూ.1.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘రాజు గారి గది’ ఇప్పటికే రూ.2.5 కోట్ల దాకా వసూలు చేసినట్లు అంచనా.