సినిమాల కోసం నటులెంత కష్టపడుతున్నారు? ఐ కోసం విక్రం... ఓ పేషెంట్ లా అయిపోయాడు... ఓ బాడీ బిల్డర్ లాగా తయారయ్యాడు. బాహుబలి కోసం ప్రభాస్... బాలీవుడ్ దంగల్ సినిమా కోసం అమీర్ ఖాన్ ఇలా బాడీలను విపరీతంగా పెంచేసి... మళ్ళీ డైట్ కంట్రోల్ తో సన్నబడటం... మరీ ఇంతలా శరీరాన్ని హింసించాలా... ఎందుకలా అంటే నేచురాలిటీ కోసం అంటారు... సినిమా తీయడం లో ఎన్నో టెక్నిక్ లు వచ్చేసాయి.... టెక్నికల్ గా ఎంతో అభివృద్ధి చెందింది. ఇంతెందుకు కెమెరాతో లావుగా, సన్నగా కనిపించేలా చేయొచ్చు. కానీ సినిమా కోసం ఇంతలా వెయిట్ పెరిగి... అదే సినిమా కోసం మళ్ళీ నెలా రెండు నెలల్లో సన్నబడడం..... సినిమా కోసం ఇదొక పబ్లిసిటీలా అనిపిస్తుంది...
సరే... అసలు విషయానికొస్తే... అనుష్క... సైజ్ జీరోలో ఎంత లావుగా కనిపిస్తుందో చూడండి... అనుష్క బొద్దుగా అప్పలమ్మలా కనిపిస్తోంది కదూ.... తన గ్లామరంతా పక్కకు నెట్టి ఈ సినిమా కోసం ఇంత లావైపోయింది పాపం... దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైజ్ జీరో సన్నజాజి నడుము.... ఈ టైటిలేమిటో? ఈ సై.జేమిటో... బొత్తిగా అర్థం కావడం లేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో అనుష్క మరింత బొద్దుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో అనుష్కకు జోడిగా ఆర్య నటిస్తున్నాడు. సోనల్ చౌహన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.