అనుష్క ఎంత ఎదిగినా ఒదిగున్నట్టే కనిపిస్తుంది. చాలా బాలెన్స్ డ్ గా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు హీరోయిన్ల గురించి కామెంట్ చేసింది. వారి పేర్లు చెప్పకుండా వారిపై కామెంట్ చేయడంతో ఇది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. చాల మంది హీరోయిన్లు తమ కెరీర్ మొదట్లో చిన్నాచితక సినిమాలు చేసి ఆ తర్వాత ఓ ఇమేజ్ రాగానే చిన్న హీరోల సరసన నటించను అని చెప్తున్నారన్న దానిపై కామెంట్ చేసింది. వరుసగా పెద్ద హీరోల సరసన సినిమాలు చేస్తున్న ఓ హీరోయిన్ ఇటీవలే చిన్న హీరోల సరసన చేయనని, పారితోషికం విషయంలో కాంప్రమైజ్ కానని మొండికేస్తున్నట్టుగా వార్తలు హల్ చల్ చేశాయి. అనుష్క వారినే ఉద్దేశించే మాట్లాడిందా? లేక మామూలుగా మాట్లాడిందా అనేది తెలియదు కానీ, వారికి పెద్ద క్లాసే పీకింది. తన కెరియర్ మొదటి రోజులను తాను మరిచిపోననీ అంటూ ఆ తొలిరోజులలో తాను నేర్చుకున్న పాఠాలే తనను టాప్ హీరోయిన్ గా మార్చాయని అంది. కెరీర్ మొదట్లో చాలా చిన్న పాత్ర దొరికినా చాలనే చేస్తాం. ఆ చిన్న క్యారెక్టర్స్ పాఠాలై మనను పైకి వెళ్ళేలా చేస్తాయి. కేవలం డబ్బు గురించే పనిచేయడం కరెక్టు కాదంటూ మాట్లాడింది. అలా చేస్తే కొన్ని రోజులకు ప్రేక్షకులు తమ పేర్లను కూడా మర్చి పోతారని అంది. ఈ కామెంట్లు కాజల్ ను ఉద్దేషించినవే అని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. కానీ వీరిద్దరికీ ఎటువంటి వృత్తిపరమైన పోటీ కూడా లేదు. కాజల్ ను ఉద్దేశించే అని కొందరంటే కాదని మరికొందరంటున్నారు. ఏది ఏమైనా ఆమె మాటల్లో మాత్రం వాస్తవం ఉంది. అనుష్క పెద్ద హీరోలతోనూ నటించింది.చిన్న వాళ్ళతో కూడా నటించింది. ఆమె అందరిలా ఆలోచించి ఉంటే అరుంధతి, పంచాక్షరి వంటి డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించేది కాదేమో...