బాలీవుడ్ లో ఓ మంచి సంస్కృతి ఉంది. ఎంత పెద్ద నటుడయినా సరే తమ స్టార్ డమ్ ని పక్కన బెట్టి అవార్డు వేదికలపై చిందులేస్తారు. ఒక్క అమీర్ ను తప్పించి మిగతా హీరోలంతా ఏదో ఒక ఈవెంట్లలో చిందులేసి మజా చేస్తుంటారు. ఇక హీరోయిన్లలైతే ఎవరైనా సరే స్టేజ్ పై తమ ఫెర్ ఫార్మెన్స్ తో మతిపోగాట్టాల్సిందే. మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, శ్రీదేవీ, కాజోల్ లాంటి సీనియర్ హీరోయిన్లతోపాటు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ప్రీతిజింటా, లేటెస్ట్ గా దీపికా పడుకునే, అలియా భట్, సోనాక్షి సిన్హా లాంటి కుర్రహీరోయిన్లు కూడా వేదికలపై ఇరగదీస్తుంటారు.
అయితే సౌత్ లో ఇందుకు చాలా మినహాయింపు ఉంది. హీరోలు దాదాపు ఇలాంటి ఈవెంట్ల జోలికి వెళ్లరు. ఏదో చిన్నా చితకా హీరోలు తప్పించి అగ్రహీరోలంతా ఈ ఈవెంట్లకు దూరంగా ఉండేవారే. ఇక హీరోయిన్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అయితే అందరూ కాదులెండి. ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఓ ముగ్గురు హీరోయిన్లు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. వారే సమంత, నిత్యామీనన్, అనుష్కలు. కోట్లకు కోట్లు పారితోషకం అందుకుంటున్న ఈ నటీమణులు అడపాదడపా అవార్డుల పంక్షన్లకు హాజరైనప్పటికీ స్టేజీల మీద ఫెర్ఫార్మెన్స్ చేసిన పాపాన పోలేదు. డాన్స్ రాకపోయినా కనీసం సందడి చేసేవారు ఎందరో ఉన్నారు. మరి వారిని చూసైనా ఇన్సిపిరేషన్ తీసుకోవాల్సిన అవసరం వీరికి లేదా? శ్రేయా, ప్రియమణి, సలోని లాంటి అవుట్ డేటెట్ నటీమణలతోపాటు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, శృతీహాసన్ లాంటి వర్తమాన నటీమణులు స్టేజీల మీద ఇరగదీస్తుంటే... డబ్బు తెగ గుంజుతున్న ఈ సీనియర్లు స్టేజీల మీద మచ్చుకైనా దర్శనమివ్వకపోవటం నిజంగా శోచనీయం.