కొత్త దర్శకుడు రంజిత్, సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కబాలి’ అనే చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ ప్రముఖ పాత్రలో నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అనుకోకుండా ‘కబాలి’ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ప్రకాష్ రాజ్ కు. ఇలా అనుకున్న నటులు పక్కకు తప్పుకోగానే రకరకాల రూమర్స్ రావడం సహజమే కదా... ఇప్పుడు కూడా అలాగే జరిగింది. మామూలుగా ప్రకాష్ రాజ్ వివాదా స్పదుడనే పేరుంది. దీంతో ఏ గొడవ పెట్టుకుని తప్పుకున్నాడో? అనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో స్వయంగా ప్రకాష్ రాజే దీనికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతకుముందు రజినీకాంత్ తో నర్శింహ అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడట ప్రకాష్ రాజ్. మళ్ళీ రజినీకాంత్ తో నటించే అవకాశం ఇన్నాళ్ళకు వచ్చిందని సంతోషిస్తున్న సమయంలో డైరెక్టర్ బల్క్ డేట్స్ 60 కావాలనే సరికి వివిధ భాషల్లో నటిస్తున్న ప్రకాష్ రాజ్ కు ఆ డేట్స్ సర్దుబాటు చేయడానికి కుదరలేదట. దీంతో ఆ సినిమానుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. తన స్థానంలో జెడీ చక్రవర్తిని మళ్ళీ తీసుకోవడం కూడా జరిగిందట. ఈ విషయాలు చెపుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఛాన్స్ మిస్ కావడం పట్ల కాస్త బాధను వ్యక్తం చేశాడు ప్రకాష్ రాజ్. అదండీ సంగతి ‘కబలీ’ టీంతో ప్రకాష్ రాజ్ కు ఎటువంటి గొడవలూ లేవు.