పెళ్ళయితే లిప్ లాక్ లో నటించడం ఇంకా తేలికట !

July 22, 2015 | 05:39 PM | 7 Views
ప్రింట్ కామెంట్
anushka_sarma_lip_lock_niharonline

బాలీ వుడ్ హీరోయిన్లు ఇప్పుడు ఎంత ఓపెన్ గా మాట్లాడితే అంత గొప్ప అనుకుంటున్నారు. బూతు పంచాంగం ఎంత గొప్పగా చెబితే వాళ్ళు మరింత ఎత్తుకు ఎదిగినట్టుగా ఫీలవుతున్నారు. ఎప్పుడు వార్తల్లో నిలవాలంటే ఇలాంటి మాంచి మషాలా ముచ్చట్లు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత గొప్పనుకుంటున్నారు.  నిత్యం  సంచలనం సృష్టించే హాట్ భామ అనుష్క శర్మ ప్రేమవ్యవహారం ఒక ఎత్తయితే... ఈ అమ్మడు ఇటివలే ఓ సంచలన కామెంట్ చేసి వార్తల్లో మరో సారి నిలిచింది. అది ఏమిటంటే హీరోయిన్స్ పెళ్లి తరువాత లిప్ లాక్ సీన్ లలో నటించడానికి ఇష్టపడతారా? అన్న ప్రశ్నకు సమాధానం గా అందులో తప్పేమిటి? కొందరు హీరోయిన్స్ మేం నటించం అని చెప్పేస్తారు కానీ...  పెళ్లి తరువాత కూడా లిప్ లాక్ సీన్ లలో నటించడానికి అభ్యంతరం ఏముంటుంది;? ఇంకా పెళ్లి అయిన తరువాత లిప్ లాక్ లో నటించడం చాలా వీజీ కదా? అటోందట ఈ భామ. 
   నీకు వీజీ అయ్యింది మొగుడికీ వీజీ అవ్వాలి కదా అనుష్కా... ఇది కొందరికీ ఈజీ కావచ్చు మరికొందరికి కష్టంగా కూడా ఉండొచ్చు. ఇది వ్యక్తిగతం... అది హీరో కయినా కావచ్చు... హీరోయిన్ కైనా కవచ్చు. అయినా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే... అని దీన్ని కూడా వీజీగానే చేసేస్తారు అందరూ... ఇప్పుడు బాలీవుడ్ కూడా హాలీవుడ్ లెవెల్ లోకి వచ్చేస్తోంది కదా...

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ