ఎప్పుడూ ఇదే జవాబా అనుష్కా....?

June 29, 2015 | 04:45 PM | 1 Views
ప్రింట్ కామెంట్
anushka_shetty_about_marriage_niharonline

కొందరు హీరోయిన్లు పెళ్ళి గురించి చెప్పే ముచ్చట్లు వింటుంటే చాలా నవ్వొస్తుంది. వీళ్ళని అడగడం అనవసరం... కానీ అభిమానులు తెగ క్యూరియాసిటీ చూపిస్తారని అడగడం... అంతే.... 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలు పూర్తయిన తర్వాత అనుష్క పెళ్లి పీటలెక్కడం ఖాయమనే వార్తలు తెగ వచ్చేసాయి ఆ మధ్య కాలంలో. కానీ ఇప్పటి వరకూ చడీ చప్పుడూ లేదు...  వార్తలు రాసే వాళ్ళకేమో ‘సుయ్ మంటే నాకో బూరె’ అన్న చందంగా... వాళ్ళు షాపింగ్ లు చేసిన ఎక్కడికైనా వెళ్ళినా... పెళ్ళికి లింకు పెట్టేస్తుంటారు. వార్తలు అల్లేస్తుంటారు. ఇలాంటిదే జరిగింది ఆ మధ్య అనుష్క విషయంలో. అయితే ఇదే విషయమై అనుష్కను అడిగితే అలాంటిదేమీ లేదంటోంది. అసలు తనకు ఇపుడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదంటోంది. స్త్రీకి వివాహం అనేది చాలా ముఖ్యమైన విషయమని తెలుసు. అయితే ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించే సమయం నాకు లేదు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆలోగా ప్రేమ పుట్టవచ్చు. లేదా తల్లిదండ్రులే మంచి వరుణ్ణి చూడవచ్చు. (రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా జరగాల్సిందే... ఇది ప్రత్యేకంగా చెప్పడం ఎందుకో?) ఆ విషయమైనా సమయం వచ్చినపుడు చెబతాను. అప్పటి వరకు నా పెళ్లి గురించి, ప్రేమ గురించి ఎలాంటి వార్తలు నమ్మ వద్దు అంటోంది అనుష్క. తన పెళ్ళి విషయం సీక్రెట్ చేయాల్సిన అవసరం తనకు లేదనీ... అందరికీ చెప్పే పెళ్ళి చేసుకుంటానంటోంది... మూడు పదులు దాటేసిన ఈ భామ పెళ్ళిగడియలు ఇంకా రానట్టుంది మరి...

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ