సాధారణంగా చిత్రపరిశ్రమలో ఏ హీరోయిన్ ఏ హీరోను అన్నయ్య అని సంబోధించదు. పరిస్థితులు మరి ప్రతికూలంగా మారితే ఫ్రెండ్స్ అని తప్పించుకుంటారే తప్ప అసలు ఆ రిలేషన్ షిప్ జోలికి వెళ్లరు. ఇప్పడు ఇలాంటి పరిస్థితి నటి, స్వీటీ అనుష్కకు ఎదురైంది. ఈ మధ్య ఓ కుర్రహీరోతో ఈ అమ్మడికి లింకు మీద లింకులు పెడుతూ మీడియా తెగ ఆనందపడిపోతుంది. ఇక వీటికి పుల్ స్టాప్ పెట్టాలనుకుందో ఏమో కానీ అనుష్క ఆ హీరోని అతడి స్నేహితుల ముందే అన్నయ్యా! అని సంబోధించిందట. అప్పటి దాకా అనుష్కతో సన్నిహితంగా మెదిలిన ఆ హీరో ఇక చేసేది లేక సైలెంటయిపోయాడని సమాచారం. ఈ రకంగా నైనా తమ మధ్య వచ్చే రూమర్లకు చెక్ పెట్టోచ్చు అనుకుందెమో. మరి మన జేజేమ్మచేత ముద్దుగా అన్నయ్య అనే పిలుపు అందుకున్న ఈ హీరో ఎవరై ఉంటారబ్బా?. మీకేమన్న తెలుసా?