రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు ముహూర్తపు క్లాప్ ఇచ్చేశారు. అయితే ఇటీవలె బాహుబలి సినిమాలో నటించిన అనుష్క బరువు పెరిగినట్టు వార్తలు వచ్చేసాయి. మరి ఈ సినిమా సైజ్ జీరో... ఇది టైటిలట. టైటిల్ ఇలా ఉన్నప్పుడు మరి అనుష్క అలా ఉండక్కర్లేదా ఏమో మరి. హీరోయిన్లు జీరో సైజ్ కోసం తెగ తాపత్రయపడుతూ జిమ్ లకు వెళ్ళి కఠినమైన ఎక్సర్ సైజులు చేయడం, ఆహార పానీయాల్లోనూ రిస్ట్రిక్షన్స్ వంటివి ఈ సినిమాలో ఉంటాయనిపిస్తోంది. ఎందుకంటే టైటిల్ అదే కదా... దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో తనయుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాడు. తొలి షాట్ ను హీరోయిన్ అనుష్కపై తీశారు. రచయిత్రి, కనికాథిల్లాన్ తొలి క్లాప్ ఇవ్వగా, నిర్మాత పొట్లూరి ప్రసాద్ సతీమణి కెమెరా స్విచాన్ చేశారు. గౌరవదర్శకత్వాన్ని రాఘవేంద్రరావు చేశారు. రచయిత్రి కనికా థిల్లాన్ ఎవరో కాదు ఈ చిత్ర దర్శకుడు ప్రకాష్ సతీమణి. ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందట. ఇక మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే సైజ్ జీరో అనే ఈ సినిమాలో అనుష్క బాగా లావుగా ఉండాలనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం తను బరువు పెంచే జిమ్మిక్కులు చేయాలట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, బరువు తగ్గడం కష్టం కానీ, బరువు పెరగడం చాలా వీజీ కదా అనుష్కా!