బాబుపై సీబీఐ నోటీసులకు కౌంటర్ గా తెలంగాణా సీఎంకు నోటీసులు

June 15, 2015 | 11:23 AM | 0 Views
ప్రింట్ కామెంట్
kcr_and_chandrababu_fight_niharonline

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కి జైలు గడప తొక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఉచ్చులో చంద్రబాబు కూడా చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎపీ సీఎం చంద్రబాబు వాయిస్‌ రికార్టులపై ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబుకు సంబంధించిన ఆడియోలపై నివేదికను ఈ రోజు కోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అదే విధంగా ఓటుకు నోటు కేసు ఫిర్యాదు దారుడు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఏసీబీ అధికారులు సీఆర్‌పీసీ 164 కింద అనుమతి కోరుతూ కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ఏసీబీ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అనుమతించే ఛాన్స్‌ ఉంది.
మరోవైపు  స్టీఫెన్‌సన్‌ విచారణ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో దర్యాప్తు అధికారులు, న్యాయనిపుణులు భేటీ అయినట్టు సమాచారం. ఈ కేసులో ఏ కోణంలోముందుకు వెళ్లాలి? ఫోరెన్సిక్‌ నివేదికను బట్టి ఎలా ముందుకెళ్లాలి? పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించడంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాలపై ఏకేఖాన్‌తో చర్చించినట్లు సమాచారం. స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలంలో ఇచ్చే వివరాలను బట్టి బాస్‌కు నోటీసులు లేదా కోర్టు ద్వారా సమన్లు అందించేందుకు సిద్ధం కావాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే నేటితో రేవంత్‌రెడ్డి రిమాండ్‌ ముగుస్తుండటంతో, ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు.  కేసు స్టేటస్‌ రిపోర్ట్‌ లేదా మెమోను దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు ఒక ఎత్తయితే,  ఈ రోజు జరిగే అంశాలు ప్రధానం కానున్నాయి. ఇదే కేసులో చంద్రబాబు ప్రమేయాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు ఆడియో టేపులను ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపిన విషయం విధితమే. కాగా ఓటుకు నోటు కేసులో ఏసీబీకి దొరికిన 50 లక్షల రూపాయలు టీడీపీ ముఖ్య నేతల కార్పొరేట్‌ సంస్థల నుంచి అందినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అయితే స్టీఫెన్‌ వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు పరిశీలించిన అనంతరం ఈ కేసులో ఏసీబీ అదనపు ఎఫ్‌ఐఆర్‌ రూపొందించే అవకాశం ఉంది. అందులో మరికొందరి పేర్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్న ఏసీబీ అధికారులు చంద్రబాబు బృందానికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి వారు నేరుగా సమాధానం చెప్పడమో లేదా స్టే కోరుతూ ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించడమో చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఈ కేసుకు కౌంటర్ గా తెలంగాణ సీఎంకు కూడా నోటీసులు జారీ చేసేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఏసీబీ నుంచి తనకు నోటీసులు జారీ కాకముందే. బాబు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వ అధికారులు.. ఇతర ప్రభుత్వ పెద్దలు, వీరందరిపై కనీసం డెబ్బై కేసులు నమోదు చేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులను నమోదు చేసే అవకాశాలను గురించి స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనకు నోటీసులు జారీ చేస్తుందని మాత్రం బాబు ఫిక్సయినట్టుగా తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ