లెజెండ్ సినిమా తరువాత చాలా గ్యాప్ వచ్చేసింది బోయపాటి శ్రీనుకు. తులసి, సింహ, భద్ర వంటి బ్లాక్ బస్టర్ మూవీలను అందించిన బోయపాటికి ఈ గ్యాప్ ఎందువల్లో ప్రేక్షకులకు ఓ పజిల్ అయ్యింది. లెజెండ్ తరువాత దర్శకుడు బోయపాటితో ‘అల్లుడు శీను’ ఫేం బెల్లకొండ శ్రీనివాస్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా ఈ సినిమా మాత్రం ప్రారంభంలోనే ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియకుండా పోయింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు అల్లు అర్జున్ బోయపాటి శ్రీనుకు ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆయన వినిపించిన ఓ కథ బన్నీకి, అల్లు అరవింద్ కు కూడా బాగా నచ్చేసిందట. దీంతో తమ సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ తోనే ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరత్వరగా చేసేస్తున్నారట. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో విడుదల కాబోతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ షూటింగ్ అయిపోగానే, ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళతారట. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తోంది.