తమిళంలో విడుదల కాబోతున్న ‘ఓకే కణ్మణి’ అనే రొమాంటిక్ సినిమాను తెలుగులో ‘ఒకే బంగారం’ అనే టైటిల్ తో దిల్ రాజ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా హక్కులను మణిరత్నం నుంచి దిల్ రాజ్ కొనుక్కున్నాడట.దిల్ రాజుకు మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టమనీ, ఈ చిత్రాన్నితెలుగు హక్కులు తీసుకుని తాను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకుంటున్నాడు.దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం సమకూర్చారు.దుల్ఖర్ సల్మాన్, నిత్యామీనన్ లు నటించారు. ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.