‘ఉద్యోగం పురుష లక్షణం’ కాదంటున్న బల్కీ?

September 18, 2015 | 05:08 PM | 1 Views
ప్రింట్ కామెంట్
balki-kareena-arjun_niharonline

దర్శకుడు ఆర్.బల్కీ ఓ వినూత్న కథ తెరకెక్కించబోతున్నారన్న విషయం ఆ మధ్య బార్తల్లో బాగా వినిపించింది. ఇందులో అర్జున్ కపూర్; కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఈ కపుల్ సహజ సిద్ధంగా ఉండేందుకు వీరిద్దరినీ ఓ గదిలో బంధించి రిహార్సల్స్ చేశారని ఆ మధ్య వార్తలు బాగా వచ్చాయి. అన్నట్టు ఈ సినిమా పేరు ‘కీ అండ్ కా’ అంట. అయితే ఇందులో సహజంగా బయట వినిపించే మాట ఇంట్లో ఉండే ఆడవాళ్ళను మీరేం చేస్తుంటారంటే ‘హౌస్ వైఫ్’ అంటుంటారు. ఇందులో అర్జున్ కపూర్ ‘హౌజ్ హస్బెండ్’నని చెప్పుకుంటాడట. ఆ పాత్రలో జీవించే ప్రయత్నం చేస్తున్నాడు అర్జున్ కపూర్. ఇందులో భార్య విజయానికి తోడ్పడే భర్తగా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. అంతే కాదు ఇందులో అమితాబ్-జయభాదురిలు కూడా ఓ జంటగా నటిస్తున్నారట. అంటే ఈ నలుగూరూ వెండితెరపై కలిసి నటిస్తున్నారు. అర్జున్ కపూర్ ఈ సీనియర్ జంటతో నటించడం చాలా హాపీగా ఉందంటూ చెప్పుకుంటుంటున్నాడు. అయితే ఈ కథలో అర్జున్ కపూర్ ఇంటిపనులు చేసుకుంటుంటే కరీనా మాత్రం ఉద్యోగానికి వెళుతుందన్నమాట. ఇలాంటి మార్పు ఫ్యూచర్ లో రావచ్చంటున్నాడు అర్జున్ కపూర్. కానీ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేగానీ ఇల్లుగడవదని అనుకునే ఈ రోజుల్లో మగాళ్ళు ఇంట్లో కూర్చుంటామంటే ఆడాళ్ళు పోషిస్తారా? ఏమో బల్కీ ఆలోచనల్లు స్క్రీన్ మీద ఏ విధంగా చూపించబోతున్నారో వెయిట్ చేద్దాం....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ