మన తెలుగు సినిమాల్లో ఎలాంటి పెద్ద ఇబ్బందులెదురైనా హీరో మాత్రమే వాటిని ఎదుర్కొంటాడు. ఒక్కొక్కరూ కాదు వంద మంది ఒకేసారి వచ్చినా ఎదుర్కొంటారు. ఇలా ఎలా చూపించినా ఎంత చూపించా చూడ్డానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారు మరీ.... బ్రూస్ లీ సినిమాలో రాంచరణ్ తన ప్రియురాలిని కాపాడుకునే స్థితిలో ఎవరో ఒకరు హెల్ప్ చేయాల్సిన పరిస్థతి ఏర్పడుతుంది. ఆ హెల్ప్ చేయాల్సిన వాళ్ళు అలాంటిలాంటి వాళ్ళైతే ప్రేక్షకులూ ఒప్పుకోరు. అందుకే డైరెక్టర్ చిరంజీవిని దింపారట. గ్యాంగ్ లీడర్ లా ఎంట్రీ ఇచ్చి చెర్రీ లవర్ ని కాపాడేస్తాడు. అసలు ఇంతకాలం బ్రూస్ లీ సినిమాలో చిరు క్యారెక్టరైజేషన్ ఏంటి? అని డైలమాలో ఉన్నఅభిమానులకు ఆ గుట్టు కాస్తా తెలిసిపోయింది. సస్పెన్స్ కి తెర వీడింది. మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టరైజేషన్ రివీలైపోయింది. ఈ సినిమాలో చెర్రీ లవర్ రకూల్ ని కాపాడే కీ రోల్ మెగాస్టార్ దే. రౌడీల భరతం పట్టి ప్రేయసీ ప్రియుల్ని కలిపే బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. దీనికోసం అదిరిపోయే స్టంట్స్ చిరు పెర్ఫామ్ చేస్తారని చెబుతున్నారు. చిరంజీవి హీరోగా అందరివాడేలే చిత్రం తెరకెక్కించాడు శ్రీనువైట్ల. ఆ సినిమా రిలీజై చాలాకాలమే అయ్యింది. మళ్లీ ఇంతకాలానికి మరోసారి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందాయనకి. ఈ దసరాకు మళ్ళీ ఈ తండ్రీ కొడుకులని తెరమీద చూసి మెగా అభిమానులు పండుగ చేసుకోబోతున్నారు.