‘ఉత్తమ విలన్’ని ఇక చూసెయ్యొచ్చు

May 02, 2015 | 03:31 PM | 155 Views
ప్రింట్ కామెంట్
uthama_villain_poster_release_may2_niharonline

గత కొన్నాళ్ళుగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఉత్తమ విలన్ కు ఇప్పటికి మోక్షం కుదిరింది. మే 1న చూద్దామనుకున్న సినిమాకు మళ్ళీ అవాంతరం ఏర్పడి చివరికి  ఈ రోజు (మే 2) సస్పెన్సుకు తెరపడినట్లయ్యింది. ఈ సినిమా విడుదలకు ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయి మధ్యాహ్నం ఆటను వేయబోతున్నట్టు వార్త వచ్చేసింది. తమిళంలో, తెలుగులోనూ షోలు నడుపుతున్నారట. బుక్ మై షోలో కూడా మార్నింగ్ షోలను తీసేసి, మధ్యాహ్నం షోలకు బుకింగ్స్ ఓపెన్ చేశారు. థియేటర్ల యజమానులు కూడా మధ్యాహ్నం షోలు వేయబోతున్నట్టు అందరికీ తెలిపారు.  నిర్మాత లింగు స్వామికి, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పాత బాకీలకు సంబంధించి నెలకొన్న గొడవకు  ఇక ముగింపు పలికినట్టే. నిన్న రాత్రి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య చర్లు జరిపిన తమిళ నిర్మాతల మండలి, ఎట్టకేలకు  వివాదాన్ని పరిష్కరించినట్లు తెలిసింది. ఇంతకు ముందు లింగుస్వామి సినిమాలతో నష్టపోయిన డిస్ట్రిబ్యటూర్లకు పరిహారం చెల్లించేలా ఒప్పందం కుదరడంతో ‘ఉత్తమ విలన్’కు లైన్ క్లియరైంది. దీంతో ఇక కమల్ నట విన్యాసాలను చూడ్డానికి  అభిమానులు థియేటర్ల వద్దకు పరుగులు పెట్టవచ్చునన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ