మంచువారింట్లో పెళ్ళి బాజాలు మ్రోగడానికి మరెన్నో రోజులు లేదు. వారింట్లో ఈ తరంలో జరిగే ఆఖరి పెళ్ళి కావడం వల్ల ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరుపుతున్నట్టు రోజుకోరకంగా వెలువడుతున్న వార్తల్ని బట్టి తెలుస్తోంది ఈ పెళ్లి వేడుకలను మంచు లక్ష్మీ ప్రసన్న, విష్ణులు పెద్దవాళ్ళుగా బాధ్యతల్ని తీసుకుని పెళ్ళి పత్రికలు ముద్రించడం నుంచి పిలుపులకు కూడా ప్రత్యేకత చూపుతున్నారు. సంగీత్, మెహందీ తదితర ఐదు రోజుల వేడుకలకు ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు గ్రాండ్ గా వుండేట్లుగా మంచులక్ష్మీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఇందులో మరో ప్రత్యేకత మామగారి పెళ్ళికి నిర్వాణ కూడా పాలుపంచుకుంటోంది. మనోజ్ పెళ్లికి ఆహ్వానిస్తూ ఓ వీడియోను చిత్రీకరించి విడుదల చేశారు. ఇందులో మంచులక్ష్మి తన కూతురు నిర్వాణతో కలిసి అందరిని పెళ్లికి ఆహ్వానించింది.