అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పీకే’ లో అతనికి జంటగా నటించిన అనుష్కా శర్మ తాజాగా ఆ అనుభవాలని మీడియాతో పంచుకుంది. మొదటి సినిమాతోనే ‘రబ్ నే బనాదీ జోడీ’ లో షారుఖ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ షారుఖ్‌కి, అమీర్ ఖాన్‌కి మధ్య తేడా ఏంటో వివరించింది. షారుఖ్ తన సహనటులతో చాలా సరదగా గడుపుతాడని.. అయితే అమీర్ ఖాన్ అలా కాదని చెప్పింది. ఎందుకోకానీ అమీర్ ఖాన్ అంత ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడడు అంటోంది. ఎప్పుడూ చిట్‌చాట్ చేసే తనకు అలా సీరియస్‌గా గడపాలంటే చాలా భయమేసేది. పైగా అతనితో మాట్లాడాలన్నా భయంగా వుండేది. అలా షారుఖ్ కన్నా అమీర్ ఖానే నన్ను ఎక్కువగా భయపెట్టాడు అంటోంది. అయితే ఆ తర్వాతర్వాత నేను బెరుకుగా వుండటం చూసిన అమీర్, తనని చిన్నగా మాటల్లో దింపడం మొదలుపెట్టాడు అని అభిప్రాయపడిరది. ఆ తర్వాత అమీర్‌తోనే ఫుల్ టైమ్‌పాస్ అయ్యేది అని నవ్వేసిందామె.