ముమైత్‌ దారిలోనే నోరా!

December 06, 2014 | 04:59 PM | 44 Views
ప్రింట్ కామెంట్

పూరీ జగన్నాథ్‌ మూవీస్‌లో ఐటం సాంగ్స్‌ ఓ రేంజ్‌లో ఉంటాయనే సంగతి తెల్సిందే. ‘పోకిరి’ లో ‘‘ ఇప్పటికింకా ’’ సాంగ్‌ తర్వాతే మళ్ళీ టాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌ హవా స్టార్ట్‌ అయిందని అంటారు. ‘పోకిరి’ తర్వాత ఆ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌ ఐటం సాంగ్‌ డిజైన్‌ చేయని పూరీ.. ఇపుడు ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ కోసం మొరాకో మోడల్‌ కమ్‌ బెల్లీ డ్యాన్సర్‌ను రంగంలోకి దింపాడని టాక్‌. బాలీవుడ్‌లో రోర్‌ .. టైగర్స్‌ ఆఫ్‌ సుందర్బన్‌తో ఎంట్రీ ఇచ్చిన నోరా ఫతేహికి, సన్నీ లియోన్‌ తర్వాత అంత క్రేజ్‌ వస్తోందని ముంబై టాక్‌. జనరల్‌గా నైట్‌ పార్టీలు కామన్‌ అయిన బాలీవుడ్‌లో నోరా ఎక్కడైనా అటెండ్‌ అయితే ‘‘ సెక్స్‌ ఆన్‌ బీచ్‌ ’’ కావాలని అడుగుతుందట. వినడానికి హాట్‌గా, షాకింగ్‌గా ఉన్న ఇదోరకం కాక్‌ టైల్‌ వోడ్కా అనే విషయం చాలామందికి తెలీదు. ఫారిన్‌ గాళ్స్‌ ఎక్కువగా ఇష్టపడే ఈ కాక్‌ టైల్‌ను నోరా టాలీవుడ్‌లోనూ పాపులర్‌ చేస్తోందని.. ‘టెంపర్‌’ ఐటం సాంగ్‌తో ముమైత్‌ లా క్రేజీ ఐటం గాళ్‌ కానుందని అప్పుడే జ్యోతిష్యం చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ