అల్యూమినియం ఫ్యాక్టరీలో బాహుబలికేం పని?

February 29, 2016 | 04:47 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Baahubali-2--shoot-hyderabad-aluminium-factory-niharonline

బాహుబలి మొదటి భాగం ఇచ్చిన సక్సెస్ ఊపుతో రెండో పార్ట్ కోసం రాత్రింబవలు కష్టపడుతున్నారు జక్కన్న అండ్ టీం. కేరళ షెడ్యూల్ తో కాస్త విరామం ఇచ్చి ఇప్పుడు తిరిగి హైదరాబాద్ లోనే ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంటున్నారు. బాహుబలి కోసం ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లు వేసిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో దాదాపు 70 శాతం షూటింగ్ ఇక్కడే జరిగింది. అయితే ఇప్పుడు షూటింగ్ జరిగేది ఫిల్మ్ సిటీలో కాదంట. నగరానికి కాస్త దూరంగా వుండే అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

                         ఇప్పటిదాకా పాడుబడిపోయిన ఈ ఫ్యాక్టరీలో చాలా సినిమాల షూటింగులు జరిగాయి కూడా. దట్టమైన చెట్లతో ఆ పరిసర ప్రాంతాలు చిన్నపాటి అడవిని తలపిస్తుంటాయి. అక్కడ ఓ ప్రత్యేకమైన సెట్ వేసి ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు రాజమౌళి. మరికొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ ఇక్కడే జరగనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అప్ డేట్లపై కూడా ప్రేక్షకులు ఆసక్తిగా గమనించడం బహుశా బాహుబలి విషయంలోనే జరుగుతుందేమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ