బాహుబలి ఫేస్ బుక్ లో ఫోర్త్ ప్లేస్

December 12, 2015 | 12:01 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Baahubali-Facebook-2015-reveiw-4th-place-niharonline

దర్శకుడు జక్కన్న కఠోర శ్రమతో నాలుగేళ్లు కష్టపడి చెక్కిన బాహుబలికి ఎంతటి ప్రజాదరణ లభించిందో తెలిసిందే. ఒక సౌత్ ఇండియన్ సినిమా ఖండాంతరాలు దాటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసిందంటే అదంతా ఆ చిత్ర టీం పడిన కష్టం ఫలితమే. కలెక్షన్ల రికార్డుతోపాటు అవార్డులపై కూడా కన్నేసిన ఆ చిత్రం తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఫేస్ బుక్ లో భారత దేశం తరపున అత్యధిక మంది సెర్చ్ చేసిన టాప్ టాపిక్ లో బాహుబలి ది బిగినింగ్ 4వస్థానం కైవసం చేసుకుంది. ఈ రివ్యూ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉండగా, ఈ-కామర్స్ రంగం రెండో స్థానంలో,  మాజీ రాష్ట్రపతి,  దివంగత అబ్దుల్ కలాం మూడో స్థానంలో ఉన్నారు. ఇక నాల్గో స్థానం సాధించిన బాహుబలి కి సంబంధించి ఓ వీడియోను  ఫేస్ బుక్ సంస్థ విడుదల చేసింది. ఈ వీడియోలో ధీవరా సాంగ్ లో తమన్నా జలపాతం దగ్గర ఉన్న సీజీ దృశ్యాలను అందంగా తీర్చిదిద్దింది.

ఈ యేడు బాలీవుడ్ నుంచి బడా స్టార్ల చిత్రాలు వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో బాహుబలి ఈ లెవల్లో హాట్ టాపిక్ గా మారటం విశేషంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రంపై పెద్ద చర్చే జరిగింది. దీంతో ఈ ఘనత సాధించినట్లు అర్థమౌతోంది. కాగా, ఈ సంధర్భంగా ఆ చిత్ర యూనిట్ ట్విట్టర్లో, పేస్ బుక్ లో పోస్ట్ లు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ