భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి ఎన్నో రికార్డులను తుడిచిపెట్టడమే కాకుండా, అందులోని నటీనటులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ కనిపించని రీతిలో ఓ అద్భుత ప్రపంచాన్ని తెర కెక్కించాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రముఖ మ్యాగ్జైన్లు సైతం బాహుబలి గురించి ఆర్టికల్స్ ను రాసి భారతీయ సినిమా ఖ్యాతిని తెగపొగిడేశాయి. ఇక వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ వర్షాన్ని ముగించిన ఈ సినిమా ఇక ప్రస్తుతం వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సందడి చేస్తోంది. అక్కడ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు తన్నుకునే రేంజ్ కి ఎదిగిపోయింది మన తెలుగు చిత్రం.
ఇప్పుడంతా అందరి దృష్టి అవార్డుల పంట మీదే. ఈ సినిమాలో బాహుబలి అనే పాత్రకి గట్టి పోటీనిచ్చింది విలన్ భళ్లాలదేవ పాత్రకే. రానా దగ్గుబాటి ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనని కనబరిచాడు. గత సినిమాలో పెద్దగా నటన కనబరచని రానా జక్కన్న చెక్కుడికి అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడని ప్రశంశలు దక్కాయి. తాజాగా రానాకి ప్రశంశలతోపాటు బాహుబలి తరపున మొట్ట మొదటి అవార్డుని అందుకోనున్నాడు. అది కూడా ఆసియాలోనే ప్రతిష్టాత్మకమైన ఆసియా విజన్ మూవీ అవార్డ్స్-2016లో రానాకి అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డు వేడుక డిసెంబర్ 2న దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. రానా ఇదే విషయాన్ని ట్విట్టర్ లో తెలియజేస్తూ, తన ఆనందాన్ని పంచుకున్నాడు. చూస్తుంటే బాహుబలి అవార్డుల సందడి మొదలైనట్లు కనిపిస్తోంది.