కుమారి 21లో ‘ఎఫ్’ ఫర్...

November 20, 2015 | 05:40 PM | 3 Views
ప్రింట్ కామెంట్
kumari_21f_f_for_fasian_niharonline

దర్శకుడు వేరయినా సుకుమార్ సినిమాగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది కుమారి 21ఎఫ్. ఊహించినట్లుగానే మంచి రివ్యూలతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, సినిమా మొత్తం బోల్డ్ సీన్లు, బూతు డైలాగులు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సుకుమార్ అసిస్టెంట్ పల్నాటి సూర్య ప్రతాప్ రెడ్డి దర్శకుడు అయిన కథ, మాటలు అందించింది మాత్రం సుక్కూయే. అసలు కుమారి 21ఎఫ్ లో ఎఫ్ అంటే ఏంటన్నది ఇఫ్పుడు ప్రశ్న. అడల్ట్ కంటెంట్ కావటంతో అదేదో బూతు అనకునేరు. ఎంత మాత్రం కాదులెండి. పోనీ ఫిమేల్ అనుకున్నా అది పొరపాటే. దానర్థం ఫసియన్ అంట.

                                    ఫసియన్ అంటే ఏషియన్ ఫుడ్ ను మెచ్చకపోవటం,  తన సొంత భాష మాట్లాడటానికి ఇష్టపడరో అలాంటి వారిని ఫసియన్ అని సంభోదిస్తారట. చిత్ర కథానుసారం ముంబై నుంచి వచ్చే పాత్రలో హీరోయిన్ కుమారి ఉంటుంది. దాంతో ఎఫ్ అని సుకుమార్ పెట్టినట్లు తెలుస్తోంది. సుక్కూ ఏది చేసిన డిఫరెంటే. మొత్తానికి యూత్ కి మాత్రం తెగ నచ్చేలా సబ్జెక్ట్ ఉందని టాక్.    

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ