బాహుబలి విలన్ మరీ ఇంత సాఫ్టా?

April 21, 2016 | 12:44 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kalakeya-prabhakar-about-his-carrer-niharonline

అతను లక్షల సంఖ్యలో ఉన్న కాళకేయులకు రాజు. రాక్షస గణంకి పెద్ద. భయానక రూపం, విచిత్రమైన కిలికిలి భాష. అయితేనేం చివరికి బాహుబలి చేతిలో ఓడి, భల్లాలదేవుడి దొంగదెబ్బకి చనిపోయాడు. ఇది బాహుబలి చిత్రంలో కాళికేయ పాత్ర పోషించిన ప్రభాకర్ గురించి. ఆ ఒక్క పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేసుకున్నాడు ప్రభాకర్. బాహుబలి ఇచ్చిన బూస్టుతో అతని కెరీర్ కు తిరుగుండదని అంతా అనుకున్నారు.  కానీ, తర్వాత అతగాడు మరే చిత్రంలో కనిపించలేదు.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దీని గురించి స్పందిస్తూ... మూస పాత్రలు చేసి విసుగొచ్చింది. ఎప్పుడూ రక్తపాతం, ఫాక్ష్యనిజం, విలనిజం చేసి చేసి బోర్ కొట్టింది. అందరు అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. అసలు నాకు అలాంటి పాత్రలంటే అస్సలు ఇష్టం ఉండదు. నాలో ఉన్న నటుడిని సంపూర్ణంగా ఆవిష్కరించేందుకు ఉపయోగపడే క్యారెక్టర్లు కొన్ని వస్తున్నాయి, అలాంటివే ఎంచుకుంటున్నా... అంటూ చెప్పుకొచ్చాడు. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన రైట్ రైట్ చిత్రంలో అలాంటి పాత్రనే పోషించాడంట. పూర్తిస్థాయి సాప్ట్ రోల్ లో హీరోకి ఫ్రెండ్ గా, ఓ బస్సు డ్రైవర్ గా ఇందులో కనిపించబోతున్నాడంట. అన్నట్లు ప్రభాకర్ కు మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించే ఓ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ధనుష్ తో ఓ చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ డేట్లు సర్దుబాటు కాక ఆ ఆఫర్ ను వదులుకోవాల్సి వచ్చిందని చెబుతున్నాడు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ