అల్లరి నరేష్, యాంగ్రీ మేన్ డాక్టర్ రాజశేఖర్ల మధ్య యుద్ధం జరగబోతోంది. ఏంటి హిట్లు లేక ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారేమో ఇద్దరూ అనుకుంటున్నారా? ఒక విధంగా అలాంటిదే అనుకోండి... వీరిద్దరు నటించిన సినిమాలు ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సుడిగాడు హిట్ తర్వాత అల్లరి నరేష్ నటించిన ఆరు సినిమాలు ప్లాప్ అయ్యాయి. వరుసగా ఒకే రకం సినిమాలు వస్తుండడంతో అల్లరి నరేష్ సినిమాలు చూడ్డం తగ్గించేశారు జనాలు. ఇక టైటిల్ లో కూడా వైవిద్యం జోడించి మళ్ళీ తెరమీద ఘరానా దొంగగా రాబోతున్నాడు. ఈవీవీ బ్యానర్‌పై నరేష్ అన్న రాజేష్ నిర్మించిన ఈ చిత్రానికి మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఇక యాంగ్రీ మేన్ రాజశేఖర్ నటించిన గడ్డం గ్యాంగ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఎవడైతే నాకేంటి సినిమా తర్వాత ఈయనకూ హిట్లు లేవు. హిట్లు లేక ఆయన కూడా సీరియస్ నుంచి కామెడీ లోకి మారిపోయారు. తమిళంలో హిట్ అయిన సూదుకవ్వం సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం వస్తోంది. ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి ఈ సినిమాలు. యాంగ్రీ నరేష్ ను. అల్లరి రాజశేఖర్ చూస్తామేమో... మరి... వెయిట్ చేద్దాం ఫిబ్రవరి 6 వరకు.