100 రోజులు పూర్తిచేసుకున్న ‘బాహుబలి’

October 17, 2015 | 11:47 AM | 2 Views
ప్రింట్ కామెంట్
baahubali_100_days-completed_niharonline

ఒకప్పుడు ఒక సినిమా ఒకే థియేటర్లో సంవత్సరం ఆడిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి తరం హీరోలు కృష్ణ, ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు, పండండి కాపురం, దానవీర శూరకర్ణ, లవకుశ లాంటి సినిమాలు 365 రోజులు ఒకే థియేటర్లో ఆడినవి... ఆ తరువాతి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వంద, రెండు వందల రోజులు ఆడితే చాలా గొప్ప.... ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రెండు వారాలు ఆడితే హిట్ సినిమాగా అనుకుంటున్నారు. అలాంటిది ఇప్పటి సినిమా వంద రోజులు ఆడిందంటే... ఒకప్పడు సంవత్సరం ఆడిన సినిమా కింద లెక్క.
తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన సినిమా అంటే రాజమౌళి ‘బాహుబలి’ ని గర్వంగా చెప్పుకోవాలి. ఈ సినిమా ప్రపంచ దేశాలకు తెలుగు వాడి ఖ్యాతిని చాటి చెప్పింది. దేశ దేశాల్లో జరుగుతున్న సినిమా ఉత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారంటే...ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీని శిఖరాగ్రాన నిలబెట్టింది.  మరి ఈ సినిమా ఈ రోజు 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇది ఈ సినిమా బృందానికే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా అభిమానులకూ పండుగ రోజు.  బాహుబలి తెలుగు, తమిళ, కన్నడ,  హిందీ భాషల్లో విడుదలై అంతటా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటికే చైనా, జపాన్, రష్యా భాషల్లోకి కూడా తర్జుమా చేయబడి అక్కడ కూడా ప్రభంజనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. 
విడుదలైంది మొదలు రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు సృష్టిస్తూ ఇండియన్ సినిమా హిస్టరీలో సెకెండ్ హయ్యెస్ట్ కలెక్షన్ చిత్రంగా నిలిచింది. మొదటి హయ్యెస్ట్ కలెక్షన్ చిత్రం అనీల్ కపూర్, అనుష్క శర్మ నటించిన రాజ్ కుమార్ హిరానీ  పీకే చిత్రం. 
బాహుబలి చిత్రం చెన్నైలో సత్యం, ఎస్కేప్, లక్సే, పివిఆర్, మాయాజాల్ థియేటర్లలో ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. ఇక తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో దాదాపు 6-7 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ముగింపు చూపించని బాహుబలి ది బిగినింగే ఇన్ని రికార్డులు సృష్టిస్తే....రెండో భాగం ది కంక్లూజన్ మరెన్ని రికార్డులను సృష్టిస్తుందో వెయిట్ చేయాల్సిందే...

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ