ఇప్పటి వరకూ బాహుబలి టీమ్ విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన దక్కింది. ఇప్పుడు మే 31న విడుదల చేయబోయే ఆడియో వేడుకకు బాహుబలి బ్రుందం కసరత్తులు చేస్తోంది. దక్షిణాది సినీ ప్రముఖులందరూ ఈ వేడుకకు హాజరయ్యే విధంగా దాదాపు కోటి రూపాయల ఖర్చుతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. ఆడియోను తమిళ, తెలుగు వెర్షన్ లను ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రం తరువాత తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఈ వేడుక మరింత గ్రాండ్ గా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆయనకు ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకోసం పెద్ద పెద్ద ఈవెంట్ కంపెనీలు పోటీ పడ్డట్టు తెలుస్తోంది. చాలా పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది.
ఇందులో శివుడు, బాహుబలిగా ప్రభాస్ నటిస్తుండగా, దగ్గుబాటి రానా విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అనుష్క దేవసేనగా నటిస్తోంది. తమన్నా అవంతికగా, రాజమాత శివగామిగా రమ్యక్రిష్ణ చేస్తున్నారు.