ఈ విషయం ముందుగా ఊహించిందే... రాజమౌళి సినిమా అనుకున్న సమయానికి ఎప్పుడూ రిలీజ్ కాదు. సినిమా పూర్తయ్యాక కూడా తుది మెరుగులకు చాలా సమయం కేటాయిస్తాడు రాజమౌళి. బాహుబలి 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం సెకండ్ పార్ట్ సెప్టెంబర్ లో మొదలు పెడతారని అనుకున్నప్పటికీ ఇప్పటి వరకూ అలాంటి ఛాయలేమీ కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం బృందం రెస్ట్ తీసుకుంటోంది. సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమా ఇంత సునామీ సృష్టించడంతో సెకండ్ పార్ట్ ఇంతకుమించి ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ రీషూట్ చేయాలనుకుంటున్నారట. కథలో మలుపులకు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో రైటర్ విజయేంద్రప్రసాద్ తో మరో బృందం వర్క్ చేస్తోందని తెలుస్తోంది. స్టోరీ కుదిరితే అక్టోబర్ చివర్లో లేదా డిసెంబర్ లో సెకండ్ పార్ట్ మొదలు పెడతారని అనుకుంటున్నారు. అంటే ఈ సినిమాను రాజమౌళి స్టైల్ లో ఎప్పటికి ఎక్స్ పెక్ట్ చేయవచ్చు? లేటయితే... మళ్ళీ రెండూ కలిపి రిలీజ్ చేస్తారేమో?