ఇండియన్ ప్రెస్టిజియస్ మూవీ ‘బాహుబలి’కి అనేక అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో జూలై 10న విడుదలకు సిద్ధమైంది. ఆడియో విడుదల కూడా వాయిదా పడింది. అయితే చివరకు సినిమా విడుదల తేది మరోసారి వాయిదాపడే అవకాశం ఉందని ట్రేట్ వర్గాల సమాచారం. ఎందుకంటే అందుకు కారణం మహేష్ ‘శ్రీమంతుడు’. ఈ సినిమా జూలై 17న విడుదలవుతుంది. ఈ సినిమా విడుదల విషయంలో మహేష్ రాజీ పడటం లేదట. సినిమాని ఎలాగైనా అనుకున్న సమయానికే విడుదల చేయాలని మహేష్ పట్టుదలగా ఉన్నాడట. దాంతో ట్రేడ్ వర్గాలు ఇప్పుడు ‘బాహుబలి’ సినిమాయే వెనక్కి వెళుతుందని అనుకుంటున్నారట. అయితే ఏ విషయము అధికారకంగా తెలియలేదు.