బాహుబలి ఉద్దేశం ఇదేనా?

July 27, 2015 | 11:56 AM | 6 Views
ప్రింట్ కామెంట్
bahubali_narendra_modi_niharonline.jpg-large

ప్రభాస్ కేవలం తెలుగు సినిమాల్లో నటించడం తప్ప ఇప్పటి వరకూ ఏ భాష జోలికీ వెళ్ళ లేదు. పైగా ఇతర సోషల్ యాక్టివిటీస్ లోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. ఏ పార్టీకి సపోర్ట్ గా ప్రచారాలూ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం సెల్ఫ్ ప‌బ్లిసిటీ కోసం తాపత్రయ పడుతున్నాడు. కారణమేమై ఉంటుంది? ఇటీవల  రాజ్ నాథ్ సింగ్ ను. నరేంద్రమోడీని కలిశాడు.  బాలీవుడ్‌లో పేరున్న హీరోలు, ద‌ర్శ‌కులు, పొలిటిక‌ల్ సెల‌బ్రెటీస్ ఇలా అంద‌రినీ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకొంటున్నాడు. బాహుబలి. వీటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యింది. కారణం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబడుతోంది... దర్శకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అటు తరువాత భజరంగి భాయిజాన్ కు కథ కూడా రాసిన ఈ సినిమా కథకుడి గురించీ మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లో నటించాడు కాబట్టి అక్కడి వారికి ఎరుగున్న రానా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎటొచ్చీ ఈ సినిమాలో నటించిన హీరో బాహుబలిని గురించి మాత్రం పెద్దగా పట్టించుకున్నట్టు కనబడడం లేదు. కొందరైతే డైరెక్టుగా దర్శకుడిని, రానాను మెచ్చుకుంటున్నారు గానీ హీరో ప్రభాస్ గురించి ప్రస్తావించడం లేదు.   అందుకే త‌న ప‌బ్లిసిటీని తానే చేసుకోవాల‌ని ఫిక్సయినట్టున్నాడు ప్రభాస్.
అందుకే ప్రముఖులందరినీ కలుస్తున్నాడు. పెదనాన్న కృష్ణం రాజు పొలిటిక‌ల్‌ పబ్లిసిటీని వాడుకొని, మోడీని, రాజ్ నాథ్ సింగ్ ను కూడా కలుసుకున్నాడు. ఇందరు పెద్ద వాళ్ళను కలిస్తే ఇండియా మొత్తంతో పాటు, ట్విట్టర్ ద్వారా ప్రపంచంలోని వాళ్ళకూ తెలిసిపోతుంది కదా. ఇదే అయి ఉంటుంది ప్రభాస్ ఉద్దేశం.
అయితే ట్విట్టర్ లో ప్రధాని మోడీ టైమ్ దొరికినప్పుడు 'బాహుబలి' చిత్రాన్ని తప్పక చూస్తా... అని పోస్ట్ చేశారు. హీరో ప్రభాస్‌ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీని కలిసి బాహుబలి చిత్రాన్ని తప్పకుండా చూడమని కోరారు. ఈ సందర్భంగా మోడీ స్పందించి ట్విట్టర్ లో ఫొటో ను పోస్ట్ చేశారు.  ప్రభాస్ తో పాటు పెద్దనాన్న బీజేపీ నాయకుడు కృష్ణంరాజు, భార్య శ్యామల, బీజేపీ ఏపీ వ్యవహారాల సంధానకర్త పురిఘళ్ల రఘురామ్‌ ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ