బాహుబలి రికార్డు బ్రేకులు మొదలయ్యాయి...

June 23, 2015 | 04:19 PM | 3 Views
ప్రింట్ కామెంట్
bahubali_trailer_images_niharonline.jpg

మన ఇండియాలో తెలుగు సినిమాలంటే ఒక చులకన భావం బాలీవుడ్ వారికీ, తమిళులకు కూడా... కానీ ఇప్పుడు తెలుగు వారి ప్రతిష్ఠను పెంచే సినిమా బాహుబలి కానుంది. ఇప్పుడు చాలా సినిమాలు బాలీవుడ్ కు రీ మేక్ అవుతున్నాయి. జాతీయ అవార్డుల్లో సౌత్ సినిమాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, శంకర్ సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యేవి. ఐ సినిమా కూడా దేశం మొత్తం ఆకర్షించింది. ఐ హిందీ వర్షన్ 1300 థియేటర్లలో రిలీజైంది. ఇది ఒక రికార్డ్  బ్రేక్ అయితే మన బాహుబలి సినిమాతో ఆ రికార్డు చెదిరిపోయింది. కరణ్ జోహార్ బాహుబలిని 2 వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడట. అంటే స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. మన సినిమా అక్కడ 2 వేల థియేటర్లలో రిలీజ్ అవుతుంటే, తెలుగులో మాత్రం కేవలం 1500 థియేటర్లలో రిలీజవుతోంది. అన్ని భాషలు ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే దాదాపు 4 వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తంలో సగం థియేటర్లు బాలీవుడ్ లోనే రిలీజవుతున్నాయన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ