బాహుబలి సినిమా షూటింగ్ దాదాపు 300 రోజులు జరుపుకొని ఉంటుంది. సినిమాలోని రాజుగారు అంటే ప్రభాస్ తన తోటి నటీనటులకు మంచి విందు భోజనం సిద్ధం చేసేవాడట. ఆయనతో పని చేసిన వాళ్లంతా కూడా అతని అతిథి మర్యాదలకు మెచ్చుకోకుండా ఉండలేక పోయేవారట. తను సెట్‌లో వున్నాడంటే ఆ వేళ చాలా మందికి ఘుమఘుమలాడే గోదావరి వంటకాల విందు భోజనం చేసేవారట. తనతో అరవై, డెబ్బయ్ రోజులు పని చేసిన వారికే ఆ రేంజ్‌లో అతని ఇంటి రుచులు భుజించే అవకాశం చిక్కితే ఇక 'బాహుబలి' చిత్రానికి ఏకంగా మూడొందల రోజులు పని చేశాడు. తనతో పాటు వున్న ఇద్దరికి భోజనం కావాలంటే, పది మందికి సరిపడా భోజనం తెప్పించడం అందరికీ తనే వడ్డించడం ప్రభాస్‌కి అలవాటట. తనతోటి వారికి బిర్యానీ, రొయ్యలు, చేపలు వడ్డించి తను మాత్రం ఎగ్ వైట్స్ తింటూ డైటింగ్ చేసేవాడట. తను తినేదేదో తెప్పించుకోకుండా, మిగిలిన వారికోసం అన్ని రకాల వంటలూ తెప్పించి పెట్టేవాడట. అది రాజుగారి లెక్క. సినిమాలోనే కాదు, బయట కూడా రాజుగారేగా మరి. రాజమౌళి ప్రభాస్ ఇంటి వంటలకి ఫిదా అయిపోయాడట.