తెలుగోడి ఖ్యాతి పెంచిన పోస్టర్

July 03, 2015 | 03:17 PM | 4 Views
ప్రింట్ కామెంట్
bahubali_in_Hollywood_media_niharonline

మొదటి సారిగా మన తెలుగు సినిమా గురించి ప్రపంచ దేశాలు ముచ్చటించుకుంటున్నాయంటే మన తెలుగు సినిమా రంగం ఎంతో పుణ్యం చేసుకుంది. ప్రపంచ దృష్టిని ఆకర్సించిన నటులు, దర్శకులు ఇంకా సాంకేతిక నిపుణులు మన తెలుగు వాళ్ళు ఉండడం చాలా గర్వించ దగిన అంశం. ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి ప్రస్తావనే.  దీన్ని గురించి ఓ ప్రముఖ హాలీవుడ్ పత్రిక గొప్పగా రాసింది. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన చిత్రమిదని పొగిడేశారు. షారూఖ్ నటించిన రా-1 చిత్రం 27 మిలియన్ డాలర్లతో తెరకెక్కితే, బాహుబలి రెండు భాగాలు కలిపి 40 మిలియన్ డాలర్లతో నిర్మిస్తున్నారు. లాస్ ఏంజిల్స్ కు చెందిన ఈ ప్రతిక బాహుబలి పోస్టర్ను కూడా ప్రచురించింది.. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఎంత హైలెట్ గా ఉందంటే, మనిషన్నవాడెవడైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. శత్రుసైన్యం మీదికి తన పొడవాటి బల్లెం విసురుతూ, ఉగ్ర అవతారంలో ప్రభాస్... ఈ స్థానంలో మన తెలుగు హీరోలను ఎవరినీ ఊహించలేమేమో అనిపిస్తుంది. ప్రభాస్ ఈ పోస్టర్ 300 సినిమాలోని కింగ్ లినైడస్ కనిపిస్తున్నాడు. మన తెలుగు వారి పౌరాణిక సినిమాలు అనేకం ఉన్నాయి. కానీ, తీసే విధానంలోనే వైవిద్యం... ఈ సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ పోరాట యోధునిగా కనిపించడానికి ఈయన లుక్ ఇలా మలిచిన రాజమౌళి, రమా, మిగిలిన టీమ్ కు ఈ క్రెడిట్ ఎంతయితే ఉంటుందో, పోస్టర్లను డిజైన్ చేసిన మార్చింగ్ యాంట్స్ సంస్థకు కూడా అంతే క్రెడిట్ దక్కి తీరుతుంది. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ