ఫ్రాన్స్ జరుగుతున్న కేన్స్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలిని ప్రమోట్ చేస్తున్నారట. దర్శకుడు రాజమౌళి తీసిన ఈ భారీ సినిమాను తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో వివిధ బాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ ఇప్పటికే మొదలు పెట్టారు. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘బాహుబలి' చిత్రాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ రిప్రజెంట్ చేసారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారిగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం ఈ చిత్రం నిడివిని తగ్గిస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ ఇంటర్నేషనల్ ఎంటర్నైమెంట్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చిత్రం రెండు భాగాలనూ విదేశీ ఆడియన్స్ కోసం నిడివి తగ్గిస్తున్నట్టు చెప్పారు.