సినిమాను కొత్తరకంగా తీయడం... పోస్టర్లు ఆడియో ఫంక్షన్ల ద్వారా ఆడియన్స్ లో ఉత్సుకత కలిగించడం ఇవన్నీ సినిమా శిల్పి రాజమౌళి క్రియేటివ్ మైండ్ కు నిదర్శనాలు. బాహుబలి సినిమా గురించి ఎన్నాళ్ళుగానో ఊరిస్తున్నారు. ఫస్ట్ ట్రైలర్ కూడా మహా గొప్పగా ప్రజెంట్ చేశారు. ఇదే తరహాలో బాహుబలి బిజినెస్ పెంచుకోవడం కోసం మరో కొత్త ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తాజా ఆలోచన ఏమిటంటే షూటింగ్ లో జరిగిన చిత్ర విచిత్ర విశేషాలను క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో త్వరలో రాజమౌళి విడుదల చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. చాలా ఇంట్రెస్టింగ్ కదా....? నిజమే మరి చిత్ర యూనిట్ అంతా కలిసి మగధీరలో ఓ డాన్స్ బీట్ చేస్తే ఎంత ఆనందంగా చూశారు జనాలు. అందులో తెరముందేగానీ తెర వెనుక ఎవరెవరు ఏమిటి? ఎలా ఉంటారు? అనేది తెలియనే తెలియదు కదా... ఈ పుస్తకంలో ఈ చిత్రం మేకింగ్ విషయాలతో పాటు ఈ సినిమా కోసం రాజమౌళి వేయించిన స్కెచ్ లతో పాటు షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన విశేషాలు కూడా ఉంటాయి. ఇది ఇలా ఉండగా రాజమౌళి రాజస్థాన్ నుండి తెప్పించిన 1000 గుర్రాలతో వచ్చే సోమవారం నుండి ఒక ప్రత్యేక యుద్ద సన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెబ్ మీడియా, ఎలట్రానిక్ మీడియా, సెల్ ఫోన్స్ హడావిడితో పుస్తకాలను చదవడం మానేసిన నేటి యువతరానికి తన ‘బాహుబలి’ పుస్తకం ద్వారా పుస్తకాల పట్ల కూడా యూత్ కు ఆసక్తి కలిగించే మంచి పని రాజమౌళి చేస్తున్నాడు.