ఫస్ట్ ర్యాంకు ఇస్తే బాగుండేది: ఇలియానా

December 26, 2014 | 04:28 PM | 37 Views
ప్రింట్ కామెంట్

కొత్త సంవత్సరం వస్తుందంటే ఈ హీరో ఏ ర్యాంకులో ఉన్నారు, ఎన్ని సినిమాలు హిట్, ఫ్లాప్, సోషల్ వర్క్ నెట్ వర్కు శోధనలో మొదటి ర్యాంకు వంటి ఎన్నో అంశాలు న్యూస్ పేపర్లలో, వెబ్ సైట్లలో వార్తలు వస్తుంటాయి. ఇంకొంచెం భిన్నంగా ఉండాలనుకున్నారేమో సినీ తారల డేటింగ్స్ లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ ఇచ్చారు ఓ టీవీ ఛానెల్ వాళ్లు. ఈ ర్యాంకుల్లో బాలీవుడ్‌లో ఆషికి సినిమా భామ శ్రద్ధాకపూర్‌కు ఫస్ట్ ర్యాంకు వచ్చిందట. ఈమెకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రెండో స్థానంలో పరిణితి చోప్రా, మూడో స్థానంలో ఇలియానా ఉన్నారు. అయితే ఈ వార్తలపై శద్ధ్ర గరంగరం లాడుతోంది. తనపై నిరాధార వార్తలు ప్రసారం చేసే హక్కు ఆ ఛానెల్‌కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తోంది. అయితే ఇలియానా మాత్రం తనకు బెటర్ ర్యాంకు ఇస్తే బాగుండును కదా అని కాస్త వ్యగ్యంగా కౌంటర్ ఇచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ