చైనాలో బాహుబలి 5000 థియేటర్లలో...

September 15, 2015 | 12:30 PM | 3 Views
ప్రింట్ కామెంట్
baahubali_movie_new_posters_(2)

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రం దేశ వ్యాప్తంగా విడుదలైన ఇన్నాళ్ళ తరువాత చైనాలో కూడా విడుదల చేశారు. ఇందులో ఎస్.ఎస్.రాజమౌళి స్ట్రాటజీ ఏమిటో గానీ, ఈ చిత్రం చూడ బోతే పీకే రికార్డులను కూడా బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 600 కోట్లకు మించిన కలెక్షన్లు రాబట్టింది.  ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదలైన అంతటా పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబట్టింది.  అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో రిలీజ్ అయితే ఒక్క చైనాలో మాత్రం  సుమారు 5000 థియేటర్లలో ఈ చిత్రాన్నివిడుదల చేయబోతున్నారు. చైనాలో ‘బాహుబలి’ని ‘స్టార్స్ ఫిస్’ అనే సంస్థ విడుదల చేయనుంది. ఇంటర్నేషనల్ స్టైయిల్ కు తగ్గట్లుగా కాస్త ఎడిటింగ్ చేయించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, అనుష్క, నాజర్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ