బాహుబలి సినిమా ప్రయోషన్ లో భాగంగా తొలి హిందీ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను రిలీజ్ చేసారు. హిందీలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుంది. హిందీలో ప్రమోషన్ల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాయి. కరణ్ జోహార్ కోరిక మేరకు ప్రభాస్, రానా, తమన్నా ముంబైలో ఇప్పటికే తమ పని మొదలు పెట్టారు. రెండు రోజుల నుండి అక్కడ సినిమా ప్రచారం నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. జులై 10వ తేదీన బాహుబలి సినిమా ప్రపంచ వ్యప్తంగా తెలుగు, తమిళం, హిందీ మళయాలంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ఎక్కవ మంది ప్రేక్షకులు రీచ్ కావడం కోసం ఇతర దేశాల్లో ఆయా భాషల్లో విడుదలువున్న ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ అటాచ్ చేసి విడుదల చేస్తున్నారట.