లెజెండ్ తరువాత రాబోయే లయన్ సినిమా కోసం బాలకృష్ణ అభిమానులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఆలస్యానికి కారణం సినిమాలో యాక్షన్ మసాలా మరింత దట్టించి ప్రేక్షకుల ముందు బ్లాక్ బస్టర్ గా నిలపాలన్నదే ఆ మూవీ మేకర్స్ ఉద్దేశంగా అనిపిస్తోంది. త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సత్యదేవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజా వార్త ఏమిటంటే హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ పార్ట్ ఒకటి షూట్ చేస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రాం లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ వర్షంలో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ దాదాపు వారం పాటు జరుగవచ్చునంటున్నారు. బాల కృష్ణ ఇంట్రడక్షన్ సీన్ గా కనిపించే ఈ ఫైట్ కోసం ప్రత్యేక మైన సెట్ వేశారు. ఇది ఈ సినిమాకే హైలెట్ అవుతుందని ఈ చిత్ర యూనిట్ మెంబర్స్ అంటున్నారు. దీంతో ఈచిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని, ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.