అక్కడి నటులే కాదు, సింగర్స్ కూడా అభిమానుల గుర్తింపు కోసం ఫొటోషూట్ చేసి, ఆ ఫొటోలతో యువత మతులు పోగొట్టేస్తుంటారు. పుట్టినప్పుడు, గిట్టినప్పడే కాదు మధ్యలో మాత్రం అవసరమా ఈ గుడ్డ పేలికలు? అంటోందీ సింగర్ రిహాన్నా. ఆమె బర్త్ డే సందర్భంగా యువతకు గిఫ్ట్ గా టాప్ లెస్ ఫొటో ఒకటి ఇంటర్ నెట్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు 27వ సంవత్లోసరంలోకి అడుగు పెట్టేసిందట. తన బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఓ పెద్ద మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ‘‘జీవితమంటే ఓ కేకు ముక్కలాంటిది కాదు. ఈ లోకంలో ఇలా ఉండడానికి మా నాన్నను నేను స్వర్గంలో ఎంపిక చేసుకున్నానని. సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ నా జీవితం నేను గర్వించే స్థాయికి చేరుకుంటోంద’’ని అంటోంది. ‘‘ప్రతి రోజు మనం నిద్రలేవడం అనేది జీవించడానికి మరో అవకాశం దొరకడం లాంటిది... ఇంకా మనం ఏం నేర్చుకోవాలి... ఏం కనిపెట్టాలి.. జనాలకు నచ్చేలా వారు సంతోషంగా జీవించడానికి మనం ఏం చేయగలమో తెలుసుకోవాలి’’ అంటూ మెసేజ్ ఇచ్చింది. అంతా బాగానే ఉంది. దీంతో పాటు. బ్లాక్ అండ్ వైట్ లో టాప్ లెస్ గా ఓ ఫొటోను పోస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఇలా అభిమానులను సంతోష పెట్టవచ్చనేగా.