ఎన్నాళ్ళుగానో అభిమానులు ఎదురు చూసిన నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా లయన్ నేడు విడుదలైంది. అయితే ఈ సినిమాను బాలక్రుష్ణ అభిమానులతో కలిసి చూడ్డం విశేషం. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అత్యధిక థియేటర్లో విడుదల చేసారు.. అయితే ఈ చిత్రాన్ని బాలయ్య అభిమానులతో కలిసి కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో వీక్షించారు. ఈయనను చూడ్డానికి , ఫొటోలు తీసుకోడానికి అభిమానులు పోటీలు పడ్డారు. అనంతరం బాలయ్య కేక్ కట్ చేసారు. బాలయ్య రాకతో థియేటర్ వద్ద అభిమానుల సందడి భారీగా పెరిగిపోయింది. అభిమానుల ఉత్సాహం తోడవవ్వగా బాలయ్య థియేటర్లో సినిమాను ఎంజాయ్ చేశారు. ఈ చిత్రం కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయనేది మరి రెండు రోజులు ఆగితే తెలుస్తుంది.