డిక్టేటర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా నటసింహ బాలయ్య ఎమోషన్ డైలాగులతో విరుచుకుపడ్డాడు. తాను తప్ప మొత్తం తెలుగు సినీ పరిశ్రమలో ధైర్యంగా అవుట్ డోర్ షూటింగ్ లో పాల్డనే మగాడు వేరే ఎవడైనా ఉన్నాడా? అని బాలయ్య ప్రశ్నించాడు. డిక్టేటర్ సినిమా అందమైన ఇన్ డోర్, అవుట్ డోర్ లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకుందని చెప్పాడు. అవుట్ డోర్ షూటింగ్ లో ఎలాంటి బెరుకు లేకుండా పాల్గోవడం మొత్తం సినీ పరిశ్రమలో తనకు ఒక్కడికే చెల్లిందని బాలయ్య పేర్కొన్నాడు. అలాంటి సాహసాలు చేస్తాను కనుకే అభిమానులు తనను ఆదరిస్తున్నాడని ఆయన చెప్పాడు. టెక్నీషియన్లు, సిబ్బంది డిక్టేటర్ ను ఉన్నతంగా తీర్చిదిద్దారని ఆయన తెలిపాడు. సంక్రాంతికి ఈ సినిమా నిజమైన పండుగను తెస్తుందని బాలయ్య పేర్కొన్నాడు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తన సినిమాలు ఉంటాయని, ఏదో ఒక వర్గాన్ని ఆకట్టుకోవడం తనకు నచ్చదని బాలయ్య అన్నాడు. కథ, కధనం, మ్యూజిక్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, డాన్సు అన్నీ ఆకట్టుకుంటాయని బాలకృష్ణ తెలిపాడు.
అసలు తెలుగు సినీ ప్రేక్షకులు నందమూరి సినిమాల్లోని డైలాగులనే ఆస్వాదిస్తారని తెలిపాడు. తమ సినిమాలతోనే తెర ముందు చిందులు, పూజలు, ఈలలు, గోలలు, కాగితాలు విసరడం వంటి సంప్రదాయాలు నెలకొన్నాయని ఆయన చెప్పాడు. అప్పట్లో తన తండ్రి గారి సినిమాలకు బళ్లు కట్టుకుని మరీ వెళ్లి చూసేవాళ్లని, ఆ తరువాత ఆ సంప్రదాయం తనకు మాత్రమే కొనసాగిందని ఆయన చెప్పాడు. తమ సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల ఈలలు, గోల ఉంటాయని, అది బీసీ సెంటర్లైనా, 70 ఎంఎం థియేటర్లైనా, మల్టీప్లెక్స్ మాల్స్ అయినా సందడి ఉండాల్సిందేనని ఆయన చెప్పాడు.