బాలయ్య యాక్షన్ కు బండ్ల గణేష్ రియాక్షన్

July 24, 2015 | 02:32 PM | 4 Views
ప్రింట్ కామెంట్
bandla_ganesh_niharonline

టిఎస్ఆర్ టీవీ 9 అవార్డుల వేడుక జులై 19న హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫంక్షన్ కు టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఎంతో మంది హాజరయ్యారు.  ఈ అవార్డుల ఉత్సవంలో బాలకృష్ణ శ్రీనువైట్లకు, బండ్ల గణేష్ కు పురస్కారాలు ఇవ్వడానికి నిరాకరించిన విషయం వార్తల్లో వచ్చేసింది. ఈ సందర్భంగా మేగాస్టార్ చిరంజీవి,  మోహన్ బాబులు లు అవార్డు విన్నర్స్ కు పురస్కారాలను అందజేశారు. బండ్ల గణేష్ తన పురస్కారాన్ని అందుకోడానికి వేదిక మీదకు వచ్చినప్పుడు తన అభిమాన నటుడు మెగా స్టార్ చిరంజీవికి పాదాభి వందనం చేశారు. ఇది బాలకృష్ణకు నచ్చినట్టు లేదు. దీనిపై బాలకృష్ణ బండ్ల గణేష్ ను వేదిక మీదే ఏదో అన్నట్టు తెలిసింది. దీనికి స్పందించిన బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘‘అందరికీ పాదాభివందనం చేస్తే అడుక్కోడం అంటారు. నచ్చిన వారికి చేస్తే దాన్ని అభిమానం అంటారు’’ అని ట్వీట్ చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బండ్ల గణేష్ జూనియర్ ఎన్టీఆర్ తోనూ, కళ్యాణ్ రామ్ తోనూ చాలా ఫ్రెండ్టీగా ఉంటాడు. మరి నందమూరి ఫామిలీ మెంబర్ అయిన బాలయ్యకు బండ్లకు మధ్య ఎందుకీ పొరపొచ్చాలు అనేది అర్థం కావడం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ