ఈ మధ్య కాలంలో 16 మంది నిర్మాతలందరూ కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి సినీ యాడ్స్ విషయంలో మీడియాను పరిమితం చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినపడుతున్న నేపథ్యంలో మీడియాలో, ఇండస్ట్రీలో ఒక గందరగోళం ఏర్పడింది. ఈ గ్రూపులో బండ్లగణేష్ కూడా ఉన్నాడనే వార్తలు వినపడ్డాయి. అయితే తాను ఆ 16మంది నిర్మాతల గ్రూపులో లేనని తన ఎదుగుదలకు మీడియా ఎంతో సహాయపడిందని, అటువంటప్పుడు తాను ఎప్పుడూ మీడియాకి వ్యతిరేకం కాదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. మరి ఈ సమస్య ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి...