ఏ సినిమాలైనా మిస్టరీ నేపథ్యంలో సాగే కథలకు గిరాకీ బాగానే ఉంటుంది. నిజ జీవితంలో జరిగే మిస్టరీ సినిమాలకు మరింత ఎక్కువగా ఎగబడి చూస్తారు. ఈ నిజ జీవిత ఘటనలను తీస్తున్నప్పుడు బంధుగణంతో, కోర్టులతో వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరీ కోర్టులో ఉన్న కేసులైతే పెద్ద గొడవలే అయిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి గొడవలనే ఎదుర్కొంటున్నాడు తమిళ్, కన్నడ ఫిలిం మేకర్ ఏఎమ్మార్ రమేష్. యన ఓ బర్డర్ మిస్టరీ కథతో ఓ నిమా తీస్తున్నాడు. ఈ సినిమాను మనీషా కొయిరాలతో చేస్తున్నాడు. ఈ కథాంశం గురించి అందరూ ఆరా తీయడానికి ప్రయత్నిస్తున్నారట. అయితే ఈ విషమమై కుష్బూ కూడా ఒకింత క్యూరియాసిటీ చూపించిందట. అది కూడా యూనిట్ సభ్యల్ని ఆరా తీసేసరికి అసలు గొడవ మొదలైంది. ఏదైనా అడిగితే డైరెక్టుగా తనను అడగాలి గానీ చిత్ర యూనిట్ వాళ్ళను అడగడమేంటని సీరియస్ అయిపోయాడు రమేష్.. ఇది సునంద పుష్కర్ కి సంబంధించిన కథగా అంతటా ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఇందులో ఓ రాజకీయ వేత్త హస్తం ఉందని కూడా అనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాకు మంచి ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారం జరగాలనే కాబోలు గతంలో ఈయన వీరప్పన్ సినిమాను కూడా నిజ జీవిత కథాంశంతోనే తీశారు.