సిగరెట్ మానండని హిట్ డైరెక్టర్ సూచన

November 03, 2015 | 04:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
be_the_hero_of_ur_life_niharonline

సామాజిక చైతన్యాన్ని కల్పించడంలో ప్రసార మాద్యమాలైన సినిమా ఇండస్ట్రీదే పై చేయి. సినిమాలు యువతను ఎంత ప్రభావితం చేస్తాయో ఒక మంచి పనికి సినిమాను అంతేబాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకూ సామాజిక స్పృహ కల్పించడానికి హీరోలను ఎక్కువగా ప్రచారానికి వాడుకున్నారు. కానీ ఇటీవల కాలంలో హీరోలతో సరిసమైన మైన ఇమేజ్ తెచ్చకున్న డైరెక్టర్ రాజమౌళి.. తన సినిమాలో తనదైన బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. తాను తెచ్చుకున్న స్టార్‌డమ్‌ను మంచిని పంచేందుకు ఎప్పుడూ వినియోగిస్తూ ఉండే రాజమౌళి, తాజాగా ‘సిగరెట్ మానండి’ అంటూ ఓ కొత్త సామాజిక చైతన్య కార్యక్రమానికి తెరతీశారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్‌టిట్యూట్ ఆధ్వర్యంలో ‘ఫైట్ స్మోకింగ్’ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాజమౌళి స్వచ్చంధంగా ప్రచారం కల్పిస్తూ తన అభిమానులకు సిగరెట్ మానమనే సలహాను బలంగా చేరవేస్తున్నారు.
ఫైట్ స్మోకింగ్ కార్యక్రమంలో భాగంగానే కార్యక్రమ నిర్వాహకులు ‘మీ జీవితానికి మీరే హీరో అవ్వండి’ అన్న కాన్సెప్ట్‌ తో ఓ వీడియోను రూపొందించింది. రాజమౌళి ఈ వీడియో ద్వారా సిగరెట్ మానమనే సందేశాన్ని ప్రపంచానికిచ్చారు. “అమితాబ్ బచ్చన్, సూపర్ హీరో, క్రిష్, మహేష్ బాబు.. వీళ్ళంతా హీరోలే! అయితే నిజ జీవితంలో మీరూ హీరో అనిపించుకోవచ్చు. ఒక్క సరైన నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది. పొగ తాగడాన్ని మానండి. మీ జీవితానికి మీరే హీరో కండి” అంటూ రాజమౌళి ఈ వీడియాలో తనదైన స్టైల్లో ఓ సందేశాన్నిచ్చారు. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ